బయటపడిన 132 ఏండ్ల నాటి సొరంగం !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని ముంబైలో జేజే ఆస్పత్రిలో 132 ఏండ్ల నాటి సొరంగం బయటపడింది. బ్రిటిష్ హయాంలో నిర్మించిన మెడికల్ వార్డులో ప్రస్తుతం నర్సింగ్ కాలేజ్‌గా మార్చిన భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని కనుగొన్నారు. జేజే ఆస్పత్రి శిలాఫలకం ప్రకారం ఈ సొరంగం 1890లో నిర్మించారని తెలుస్తోంది. వాటర్ లీకేజ్ ఫిర్యాదుపై తాము నర్సింగ్ కాలేజ్ భవనాన్ని సందర్శించామని, పీడబ్ల్యూడీ ఇంజనీర్లు, సెక్యూరిటీ గార్డులు బిల్డింగ్‌ను సర్వే చేయగా ఈ విషయం బయటపడిందని అధికారులు తెలిపారు. నర్సింగ్ కాలేజ్ ప్రాంగణంలో బేస్‌మెంట్ ఉండవచ్చని సిబ్బంది తెలిపిన మీదట తాము తనిఖీలు చేపట్టగా సొరంగం బయటపడిందని చెప్పారు. జేజే ఆస్పత్రి, గ్రాంట్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈ నర్సింగ్ కాంప్లెక్స్ ఉంది. 1843లో గ్రాంట్ మెడికల్ కాలేజ్ భవనానికి శంకుస్ధాపన జరిగిందని శిలాఫలకంలో పొందుపరిచి ఉందని అధికారులు తెలిపారు. సొరంగంపై ప్రాధమిక పరిశోధన వివరాలను కలెక్టర్ కార్యాలయానికి, పురావస్తు శాఖకు సమర్పిస్తామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)