11 రోజుల పాటు ఆహారం లేకుండా చుక్కానిపైనే ప్రయాణం !

Telugu Lo Computer
0


నైజీరియా నుంచి అలిథిని-2 అనే నౌక ఆయిల్‌తో అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా 11రోజుల పాటు ప్రయాణించి స్పెయిన్‌లోని కేనరీ ఐలాండ్‌ తీరానికి చేరుకుంది. అక్కడ కోస్ట్‌ గార్డులు ఓడ చుక్కానిపై ఉన్న ముగ్గురిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తమకు తినేందుకు తిండి కూడా లేదని, అందుకే ఉపాధిని వెతుక్కుంటూ వలస వచ్చినట్టు  ఆ ముగ్గురు తెలిపారు. నైజీరియాలోని లాగోస్‌ నుంచి ఇలాగే ప్రయాణించినట్టు వెల్లడించారు. ఆ విషయాలు విన్న కోస్ట్‌ గార్డులు షాక్‌కు గురయ్యారు. 11 రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా ప్రయాణించడంతో ముగ్గురూ డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)