కమ్యూనిస్టుల పాలన దేశానికి అవసరం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 15 October 2022

కమ్యూనిస్టుల పాలన దేశానికి అవసరం

14 నుంచి 18 వరకు జరుగుతోన్న భారత కమ్యూనిస్టు పార్టీ 24 వ జాతీయ మహాసభలకు విజయవాడ వేదికయ్యింది. మహాసభల తొలిరోజు భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించారు సీపీఐ నేతలు. విజయవాడలో జరిగిన భారీ ప్రదర్శన చేశారు. విజయవాడలో సిపిఐ మహాసభలు జరగటం ఆనందంగా వుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. విజయవాడ కమ్యునిస్ట్ లకు కంచుకోట. ఎంతో మంది కమ్యునిస్ట్ లు దేశం కోసం ప్రాణాలర్పించారు. మైనారిటీలను, షెడ్యుల్ కులాలను బిజెపి నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. బిజెపి హిందుత్వ ఎజెండాతో ప్రజల్ని మోసం చేస్తుంది. దేశంలో కేరళ పరిపాలన మోడల్ రావాలి. మోదీ అంబానీ, అదానీలతో కుమ్మక్కయ్యారు. కోవిడ్ టైమ్ లో ప్రజలను కేంద్రం గాలికి వదిలేసింది. పబ్లిక్ సెక్టార్ లు ప్రైవేట్ పరమవుతున్నాయి. దేశ ఆర్థికాభివద్ధి అంటే ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేయటమా? అని ఆయన ప్రశ్నించారు. మోదీ పగలు,రాత్రిప్రైవేట్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. యువతకు మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగాల హామీ ఏమైందన్నారు డి.రాజా. ఆర్ఎస్ఎస్ హిందూ, హిందీ, హిందుస్థాన్ అనే పదాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. బిజెపి, ఆర్ఎస్ఎస్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. దేశంలో ఎన్నో వనరులున్న వాటిని వినియోగించుకోవటంతో బిజెపి విఫలం చెందింది. కమ్యునిస్ట్ పార్టీల పాలన దేశానికి చాలా అవసరం. రాజ్యాంగంలో వున్న సమానత్వం దేశంలో అమలు కావట్లేదు. దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం కమ్యునిస్ట్ పార్టీలు మాత్రమే అన్నారు. విప్లవం వర్ధిల్లాలి అన్నారు. సిపిఐ 24వ జాతీయ మహాసభలలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. దేశంలో సామాజిక న్యాయం కనుమరుగైంది. బిజెపి లాంటి హిందుత్వ శక్తులను అడ్డుకోవటం కమ్యునిస్ట్ ల వల్లే సాధ్యం. ప్రపంచ దేశాలు కమ్యునిస్ట్ పార్టీల వైపు చూస్తున్నాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో నిరుద్యోగం అధికమైంది. దేశంలో అసలు లౌకికవాదం అమలవుతుందా దేశంలో రాజ్యాంగం నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment