బాల్య వివాహాల్లో కేరళ ఆదర్శం !

Telugu Lo Computer
0


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా డెమోగ్రాఫిక్ శాంపిల్ సర్వే ప్రకారం బాల్య వివాహాల్లో కేరళ ఆదర్శంగా నిలిచింది. ఝార్ఖండ్‌ లో  మాత్రం అత్యధిక శాతం బాల్యవివాహాలు చేస్తున్నారు. ఝార్ఖండ్‌లో వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిల శాతం 5.8గా ఉందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమీషనర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా ఈ సగటు 1.9శాతంగా ఉంది. కేరళలో ఈ సంఖ్య 0.0గా ఉంది. ఝార్ఖండ్‌, బెంగాల్ రాష్ట్రాల్లో సగం మందికిపైగా యువతులకు 21 ఏళ్లు నిండకుండానే వివాహం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఝార్ఖండ్‌లో బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో మూడు శాతం ఉన్నాయని సర్వే పేర్కొంది. ఈ సర్వే 2020లో నిర్వహించగా.. గత నెల చివరిలో నివేదిక సిద్దమైంది. దేశంలో సగానికి పైగా మహిళలు 21 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకున్న రాష్ట్రాలు ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మాత్రమే. 

Post a Comment

0Comments

Post a Comment (0)