కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికైన విషయం విధితమే. ప్రత్యర్థి అభ్యర్థి శశిథరూర్‌పై 84శాతం ఓట్ల తేడాతో ఖర్గే విజయం సాధించారు. ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్ కు 1072 ఓట్లు పోలయ్యాయి. కాగా, బుధవారం పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 10:30 గంటలకు 80ఏళ్ల ఖర్గే పార్టీ పగ్గాలు అందుకోనున్నారు. అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. మధుసూదన్ మిస్త్రీ అధ్యక్ష ఎన్నిక సర్టిఫికేట్‌ను ఖర్గేకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు పాల్గొంటారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ల నాయకులు, ఏఐసిసి ఆఫీస్ బేరర్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, వివిధ విభాగాల ఇంచార్జ్ లు,మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మంత్రులు, అన్నిరాష్ట్రాల్లోని మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ సీఎల్‌పీ నాయకులు పాల్గోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆహ్వానాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు 24ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబానికి చేరుతున్నాయి. 53ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న ఖర్గే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో రేపు పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి పదవికి చేరుకున్నారు. లోక్ సభ, రాజ్యసభా పక్ష నేతగానూ పనిచేశారు. పదేళ్లుగా కేంద్ర మంత్రిగా, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా ఖర్గే పనిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)