జపాన్ లో రామ్ చరణ్ క్రేజ్ !

Telugu Lo Computer
0


జపాన్ లో ఆర్ఆర్ఆర్ త్రయం ప్రమోషన్స్ మొదలుపెట్టింది.  రామరాజు కటౌట్స్ ను, ఫోటోలను పట్టుకొని జపాన్ యువత రామ్ చరణ్ కు ఘనంగా స్వాగతం పలికింది. అంతేకాకుండా జపాన్ యువతులు తెలుగు నేర్చుకొని మరీ రా రామ్ చరణ్ కు స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “అందరికి నమస్కారం.. రామ్ చరణ్ మీరంటే మాకు ఎంతో ఇష్టం.. మిమ్మల్ని జపాన్ కు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వి ఆర్ ఆల్ లవ్ యూ” అని ముద్దుగా తెలుగులో మాట్లాడిన తీరు ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.ఈ సినిమా జపాన్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)