ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు

Telugu Lo Computer
0


ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మూడు రోజుల క్రితం కాబూల్ లోని స్కూల్ లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే బుధవారం మరో బాంబు పేలుడు సంభవించింది. స్కూల్ బాంబు దాడిలో 46 మంది విద్యార్థినులతో పాటు మొత్తం 53 మంది మరణించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వరసగా ఎక్కడోచోట బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీలు అయిన షియా, హజారాలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ లో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు ఐఎస్ ఖోరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తోంది. గతంలో మసీదుల్లో కూడా ఆత్మాహుతి దాడులు చేసి వందల మందిని పొట్టనపెట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)