హురియత్ నేత అల్తాఫ్ షా కన్నుమూత

Telugu Lo Computer
0


కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు, దివంగత హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ అల్లుడు అల్తాఫ్ షా న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం తీహార్ జైలు నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. అల్తాఫ్ షా (66) మంగళవారం తెల్లవారుజామున క్యాన్సర్‌తో మరణించారు. అల్తాఫ్ షా.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో "ఖైదీగా" తుది శ్వాస విడిచినట్లు ట్వీట్‌లో తెలిపారు. శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన హురియత్ నాయకుడిని జులై 25, 2017న మరో ఆరుగురితో కలిసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) విచారించిన ఉగ్రవాద నిధుల కేసులో అల్తాఫ్‌ షాని అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచారు. అల్తాఫ్ షాకు మూత్రపిండ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 1న ఆదేశించింది. అల్తాఫ్‌ కుమార్తె రువాషా తన తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)