వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు !

Telugu Lo Computer
0


తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి పారా వాసుదేవన్‌ ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో తన న్యూడ్‌ ఫోటోలు షేర్‌ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్‌ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్‌ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్‌ అధికారులు డిమాండ్‌ చేశారు. ఉన్నత అధికారులకు రాసిన లేఖలో తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్‌ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్‌ను పోలీస్‌ శాఖ వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది.


Post a Comment

0Comments

Post a Comment (0)