భర్త ఆదాయ వివరాలు ఆర్టీఐ కింద భార్య పొందొచ్చు !

Telugu Lo Computer
0


భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా మంది తమ అసలైన ఆదాయాలు చూపించరు. ఈ సమస్యను కేంద్ర సమాచార కమిషన్ తీర్చేశారు. ఆర్టీఐ కింద భార్యలకు భర్తల ఆదాయ వివరాలు ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ అందజేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. సంజు గుప్తా అనే మహిళ తన జీవిత భాగస్వామి ఆదాయ వివరాలను కోరుతూ ఆర్టీఐ దాఖలు చేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట్లో, ఈ వివరాలు చెప్పడానికి ఆమె భర్త అంగీకరించలేదనే కారణంతో సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆదాయపు పన్ను అధికారి, బరేలీలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఆర్టీఐ కింద వివరాలను అందించడానికి నిరాకరించారు. ఆ తర్వాత ఆ మహిళ అప్పీలేట్ అథారిటీ కి అప్పీల్ దాఖలు చేసింది అయినప్పటికీ, సిపిఐఓ ఉత్తర్వును సమర్దించిన ఎఫ్ఏఏ ఆమెకు వివరాలు అందించడానికి నిరాకరించింది. దాంతో సంజు గుప్తా కేంద్ర సమాచార కమిషన్ కు రెండవ అప్పీల్‌ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల గత ఆదేశాలు, తీర్పులను పరిశీలించిన కేంద్ర సమాచార కమిషన్ తన ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె అప్లై చేసిన తేదీ నుండి 15 రోజుల లోపు పబ్లిక్ అథారిటీ వద్ద అందుబాటులో ఉన్న ఆమె భర్త యొక్క పన్ను విధించదగిన ఆదాయం వివరాలను ఆమెకు అందించాలని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ని ఆదేశించింది. అలా వివరాలు పొందడం ఆమె హక్కని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)