ఫ్రెంచ్ రచయిత్రికి నోబెల్ సాహిత్య పురస్కారం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 6 October 2022

ఫ్రెంచ్ రచయిత్రికి నోబెల్ సాహిత్య పురస్కారం


ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్‌కు ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. 'ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్ ఆక్యుటీ' పేరుతో రాసిన పుస్తకానికి గాను ఆమె పురస్కారం అందుకోనున్నారు. టాంజానియా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా (74) గతేడాది సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. వలసవాదంపై పోరాటం చేస్తూనే శరణార్థుల సమస్యలను కళ్లకు కట్టినట్టు అక్షరబద్ధం చేసినందుకు గాను ఆయనీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈసారి ఫ్రాన్స్ రచయిత్రిని ఈ అత్యున్నత పురస్కారం వరించింది. అత్యంత ధైర్యం, కచ్చితత్వంతో వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలపై చేసిన కృషికి గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. 1940లో నార్మండీలోని వైవోటోట్‌ అనే చిన్నపట్టంలో జన్మించిన ఎర్నాక్స్ 1974లో రచనలు మొదలుపెట్టారు. 82 సంవత్సరాల వయసులో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. సాహిత్యంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఎర్నాక్స్  ఫిక్షన్ నవలలతోనే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినా అనంతర కాలంలో ఆటోబయోగ్రఫీల వైపు వెళ్లారు. 1974లో 'లెస్ ఆర్మోయిర్స్ వైడ్స్', 1990లో 'క్లీన్డ్ అవుట్'తో మంచి పేరు సంపాదించారు. కాగా, ఇప్పటికే వైద్యశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. వైద్యశాస్త్రంలో మానవ పరిణామ క్రమంపై చేసిన పరిశోధనలకు గాను స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు నోబెల్ ప్రకటించగా, 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్‌'లో చేసిన పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ లభించింది. అలాగే, రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ లభించింది. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు.

No comments:

Post a Comment