యమునా నదికి వరద

Telugu Lo Computer
0


ఢిల్లీలో యమునా నదికి ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షం కారణంగా వరద తీవ్రత ఉధృతంగా మారింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. యమునా నదికి ఆనుకుని వ్యవసాయం చేస్తూ 50 వేలకు మందికి పైగా పేదలు జీవనం సాగిస్తున్నారు. వారిని సైతం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం ఇప్పటికే అక్కడి ప్రభుత్వం షెల్టర్లు, తాగునీటి సౌకర్యం, భోజనాలు ఏర్పాటు చేసింది. దీంతో వరద బాధితులు రోడ్లు, ఫుట్ పాత్ లపై, ఫ్లైఓవర్ల కింద నివాసం ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిర్వాసితులు.. తమను ఎవరూ ఆదుకోవడం లేదంటూ వాపోతున్నారు. వరద వల్ల ఇంట్లో అన్ని సామాన్లు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)