రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 21 October 2022

రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి ?


ఒక వ్యక్తికి ఎంత నిద్ర అవసరం నిద్ర అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. రోజులో 1/3 వంతు అన్నమాట. అంటే మన జీవితంలో 1/3 వంతు విశ్రాంతి లేదా నిద్ర అవసరం అనేది కాదనలేని సత్యం. అయితే సాధారణంగా ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు నిద్రలేమి సమస్య ఎదుర్కొంటారు. నిద్ర లేవగానే తలనొప్పి, ఫ్రెష్‌గా అనిపించక పోవడం, దైనందిన పనులు చేసుకోతేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. ఈ విధంగా నిద్రలేమి ఎక్కువ కాలం కొనసాగితే డిప్రెషన్, ఆందోళనలకు దారి తీస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి. ఫలితంగా శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. దీంతో అనతికాలంలోనే బరువు పెరిగిపోతారు. రాత్రి 6 నుంచి 7 గంటలు నిద్రపోని వారు పగటిపూట కొన్ని గంటలపాటు నిద్రపోయి ఆ సమయాన్ని భర్తీ చేయాలనుకుంటారు కొందరు. కానీ ఆ అలవాటు ఆరోగ్యానికి అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనీసం రోజుకు 6-7 గంటలు నిద్రపోవాలి. అలాగే ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పగటిపూట నిద్రపోతే, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవచ్చు. అందువల్ల పగటిపూట నిద్రపోయే అలవాటును మానుకోవాడం మంచిది.  రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే దాన్ని నిద్రలేమి సమస్య అంటారు. నిద్రపట్టకపోతే చాలా మంది నిద్ర మాత్రలు ఉపయోగిస్తారు. నిద్రలేమి మరొక లక్షణం ఏంటంటే.. పెద్దగా గురక పెట్టడం. గురకపెట్టి నిద్రపోతే తాము బాగా నిద్రపోతున్నామని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గురకపెట్టడం శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఎగువ వాయు మార్గం మూసివేయడం వల్ల గురక సంభవిస్తుంది. కాబట్టి ఎవరైనా గురక పెడుతున్నారంటే వారికి నిద్ర సరిగా పట్టడం లేదని అర్థం. గురక పెట్టే సమయంలో ఆక్సిజన్ తక్కువగా అందడం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. మరెలా అనుకుంటున్నారా? నిద్రపోయే ముందు ఫోన్‌, టీవీ చూడకూడదు. అలాగే పడుకోవడానికి 3-4 గంటల ముందు టీ, కాఫీ తీసుకోకూడదు. తేలిక పాటి భోజనం చేయాలి. 

No comments:

Post a Comment