ఆంధ్రప్రదేశ్ ని వదలని వరుణుడు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 14 October 2022

ఆంధ్రప్రదేశ్ ని వదలని వరుణుడు !


ఉపరితల ఆవర్తనం వలన ఈ రోజు కూడ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరం కేంద్రం  తెలిపింది.  ఈ రోజు తెల్లవారుఝామున కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, అలాగే రేపు తెల్లవారుఝామున కూడా వానలు కురుస్తాయని పేర్కొన్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నగరం శివారు ప్రాంతాలు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ​, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని కడప జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాలో కూడ అక్కడక్కడ వర్షాలుంటాయి. కానీ గత ఐదు రోజులతో పోలిస్తే ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో తక్కుగానే వర్షాలుండే అవకాశాలున్నాయి. బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దానితో పాటు కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడుతుంది. ఈనెల 17 లేదా 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల దిశగా రానుందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో ఏపీలో మరిన్ని వర్షాలు కురువనున్నాయి. 

No comments:

Post a Comment