రాత్రి 7 గంటల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలకు దూరం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 October 2022

రాత్రి 7 గంటల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలకు దూరం !


మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా కాడేగావ్‌ మండలం మోహిత్యాంచె వడ్గావ్‌ గ్రామంలో సాయంత్రం అయితే ఫోన్‌లు, టీవీలు పక్కన పెట్టాలన్న నిబంధన అమల్లో ఉంది. ఇంతకీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటంటే. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు వినడానికి గ్రామంలో ఉన్న విద్యార్థులకు పేరెంట్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు కొనిచ్చారు. దీంతో పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆ ఫోన్‌లతోనే గంటలకొద్ది గడపడం ప్రారంభించారు. ఇక ఇంట్లో మహిళలు సైతం టీవీలకు అతుక్కుపోయారు. దీనంతటినీ గమనించిన గ్రామ సర్పంచ్‌ విజయ్‌ మోహిత్‌ విద్యార్థుల భవిష్యుత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఆగస్టు 15వ తేదీన గ్రామంలోని మహిళలతో సమావేశమై రోజూ రాత్రి 7 నుంచి 8.30 మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు పూర్తిగా ఆఫ్‌ చేయాలని తీర్మానించారు. మరి ఇంట్లో ఉన్న వాళ్లు ఫోన్‌లకు, టీవీలకు దూరంగా ఉన్నారనే విషయం ఎలా తెలుస్తుందనేగా.. ఈ బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. రాత్రి 7 కాగానే సైరన్‌ మోగిన వెంటనే ఫోన్‌లు, టీవీలను పక్కన పెట్టేసి తమ తమ పనులు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment