వాము నీటితో ఊబకాయం చెక్ !

Telugu Lo Computer
0


సాధారణంగా చాలామంది ప్రజలు నూనె పదార్ధాలు, తీపి వంటకాలను ఇష్టంతో తింటారు. దీని కారణంగా తరచూ ఊబకాయం బారిన పడుతూ ఉంటారు. ఒక్కసారి శరీర బరువు పెరిగితే తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌ కారణంగా రోజువారీ పనిలో పడి జిమ్‌కి వెళ్లలేకపోతున్నారు. ఇంకా నిపుణులు చెప్పే డైట్లను కూడా అనుసరించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు సులభంగా బరువు తగ్గాలనుకుంటే ప్రత్యేక పానీయాన్ని ఆశ్రయించవచ్చంటూ ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వాముతో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో ఔషధ గుణాలు దాగున్న వామును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీని ద్వారా పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడి.. మలబద్దకం, అజీర్తి లాంటి సమస్యలు దూరమవుతాయి. కావున వామును నీటిని తాగడం వల్ల పొట్ట, నడుము కొవ్వు తగ్గుతుందని చెబుతున్నారు. అందరి వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసును బరువు తగ్గేందుకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం .  ప్రతిరోజూ ఉదయం ఏమీ తినకుండా వాము వాటర్ తాగితే, అది బరువును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లి ఫ్యాట్‌ కూడా క్రమంగా తగ్గుతుంది. వాము నీటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత కూడా తాగవచ్చు. మెరుగైన ఫలితం కావాలంటే మీ రోజువారీ ఆహారంలో వాము మొత్తాన్ని పెంచండి. బరువు తగ్గడానికి 25 గ్రాముల వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెల రోజుల పాటు వాము వాటర్ తాగితే మీ శరీరం తేడాను గుర్తించవచ్చు. మీరు వామును రాత్రిపూట నీటిలో నానబెట్టడం మరచిపోతే, ఒక చెంచా గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి.. మరగబెట్టండి. ఇప్పుడు దానికి 5-6 తులసి ఆకులను జోడించండి. ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)