మళ్లీ తగ్గనున్న వంటనూనెల ధరలు ?

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడంతో వంటనూనెల ధరలు దిగొచ్చాయి. వంట నూనెల ధరల్ని తగ్గించాలంటూ ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీలతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పలుమార్లు చర్చలు జరిపింది. వెంటనే వంటనూనెల ధరల్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, లీటర్‌పై ఎంత తగ్గించాలో ఆదేశించింది. దీంతో ఆయిల్ కంపెనీలు  మేరకు వంట నూనెల ధరల్ని తగ్గించాయి. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వంట నూనెల తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో గురువారం మరోసారి చర్చలు జరపబోతోంది. గత నెలలో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో రీటైల్ మార్కెట్‌లో వంట నూనెల ధరల్ని మరింత తగ్గించే అవకాశాలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించనుంది.  ఈ ఏడాది మే నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ఇది మూడోసారి. పామాయిల్ ఎగుమతిదారులో అతిపెద్ద దేశమైన ఇండోనేషియా ఎగుమతులపై నిషేధాన్ని తొలగించడం, పొద్దుతిరుగుడు, సోయా నూనెల సరఫరాను సడలించడం లాంటి పరిణామాల తర్వాత గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో తగ్గిన ధరల్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. రీటైల్ వంటనూనెల ధరల్ని మరింత తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశం వార్షికంగా వినియోగించే వంటనూనెల్లో 56 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది.  ట్రేడ్ డేటా ప్రకారం, పామాయిల్ ధరలు తగ్గాయి. గత నెల రోజుల్లో చూస్తే జూలై 29 నాటికి పామాయిల్ టన్నుకు 14 శాతం తగ్గి 1,170 డాలర్లకు పడిపోయింది. అలాగే సోయాబీనన్ ఆయిల్ ధర 4 శాతం తగ్గి టన్నుకు 1,460 డాలర్లకు చేరుకోగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 14 శాతం తగ్గి టన్నుకు 1,550 డాలర్లకు చేరుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)