షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోవటం ఖాయం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 July 2022

షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోవటం ఖాయం !


ముంబైలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో శరత్ పవార్ మాట్లాడుతూ  షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంది అంటూ జోస్యం చెప్పారు. ఇప్పుడు బీజేపీతో కలిసి షిండే ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం కూడా రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో ఈ కూటమి పతనం అవుతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు పవార్. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేతగా పవార్ చేసిన ఈ వ్యాఖ్యలపై కలకలం రేగుతోంది.  ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని పవార్ ఈ సందర్భంగా అన్నారు. ఒకసారి మంత్రి వర్గాన్ని ప్రకటించి శాఖలు కేటాయిస్తే వారి అశాంతి బయటపడుతుందని..అదికాస్త చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది పవార్ అన్నారు. బీజేపీతో జట్టు కట్టి చేసిన తమ 'ప్రయోగం' విఫలమైన తర్వాత అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈక్రమంలో తమకు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నదని ఎన్సీపీ ఎమ్మెల్యేకలు తెలిపారు పవార్. కాబట్టి నేతలు అంతా మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని..నేతలంతా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలల్లోనే ప్రజల మధ్యే సమయం గడపాలని పవాన్ సూచించారు.

No comments:

Post a Comment