వర్క్ ఫ్రమ్ హోం కొత్త రూల్స్

Telugu Lo Computer
0


స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్‌లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోంను ప్రభుత్వం ఏడాదికే పరిమితం చేసింది. పైగా దీనిని 50 శాతం మంది ఉద్యోగుల వరకూ విస్తరించుకోవచ్చని తెలిపింది. కామర్స్ మినిష్ట్రీ విడుదల చేసిన స్టేట్మెంట్‌లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ 2006, కొత్త రూల్ 43ఏను ప్రస్తావించింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కు వర్క్ ఫ్రమ్ హోం పాలసీని అందులో పేర్కొంది. కొత్త రూల్ ప్రకారం సెజ్ లోని ఉద్యోగుల్లో ఒక ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోంకు అర్హులు. తాత్కాలికంగా ఆఫీసులకు వెళ్లలేనివారు, ప్రయాణాల్లో ఉన్న వారు ఈ కేటగిరీలోకి వస్తారు. అలా వర్క్ ఫ్రమ్ హోం అనేది ఉద్యోగుల్లో దాదాపు 50శాతం మందికి కేటాయించవచ్చు. కాంట్రాక్చువల్ ఉద్యోగులకైనా సరే ఈ ఆప్షన్ వర్తిస్తుంది. అంతకుమించి ఎంప్లాయీస్ కు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వదలిస్తే SEZ అనుమతి పొందాల్సి ఉంటుంది. “ఇక వర్క్ ఫ్రమ్ హోం అనేది గరిష్ఠంగా ఏడాది మాత్రమే ఇవ్వనున్నాం. అదే విధంగా ఇంకా పెంచాల్సిన అవసరమస్తే ఆ యూనిట్లు ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టుకుంటేనే సాధ్యపడుతుందని” సంబంధిత మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)