లైఫ్ టైమ్ పెన్షన్ ప్లాన్‌ - సరళా పెన్షన్ ప్లాన్‌

Telugu Lo Computer
0


ఎల్‌ఐసీ సరళా పెన్షన్ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెడితే, తర్వాత మీరు జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. పాలసీదారు మరణించిన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగి నామినీకి అందజేస్తారు. ఈ పథకాన్ని 40 ఏళ్ల వయస్సు నుంచి 80 ఏళ్ల వయస్సు వరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఒంటరిగా లేదా భార్యాభర్తలతో కలిసి ఈ పథకాన్ని తీసుకోవచ్చు. పాలసీదారు ఈ పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి అవసరమైతే 6 నెలల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మధ్య రిటైర్మెంట్‌ తీసుకున్న వ్యక్తులు నెలకు 12,000 పెన్షన్ పొందవచ్చు. ఎలాగంటే రిటైర్మెంట్‌ తర్వా త పీఎఫ్‌ ఫండ్ నుంచి వచ్చిన డబ్బు ఇందులో పెట్టుబడి పెడితే సులువుగా పెన్షన్ పొందుతారు. ఎల్‌ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం ఎవరైనా 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల ప్లాన్‌ కొనుగోలు చేస్తే అతను ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందుతాడు. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ ప్లాన్‌లో ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత ఎవరైనా వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవచ్చు..ఇకపోతే ఈ పాలసీని తీసుకోవడం వల్ల లోన్ పొందే సౌకర‍్యం కూడా ఉంటుంది..

Post a Comment

0Comments

Post a Comment (0)