స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్

Telugu Lo Computer
0


మహారాష్ట్ర కొత్త స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఆదివారం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో ఆయన 164 ఓట్లతో విజయం సాధించారు. అసెంబ్లీలో మొత్తం 288 ఓట్లు  ఉండగా, ఈ ఎన్నికలో గెలవాలంటే 145 ఓట్లు రావాలి. కానీ, రాహుల్ మెజారిటీ కంటే 19 ఓట్లు ఎక్కువ సాధించారు. రాహుల్ సాల్వే, అధికార బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున పోటీ చేశారు. ఆయనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, మరో ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో సులభంగా విజయం సాధించారు. రాహుల్ ప్రత్యర్థిగా మహా వికాస్ అఘాడి తరఫున రాజన్ సాల్వి పోటీ చేశారు. ఆయనకు ఈ ఎన్నికలో 106 ఓట్లు పోలయ్యాయి. శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నర్హరి జిర్వారి ఈ ఎన్నిక నిర్వహించారు. రాహుల్ అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యే కావడం విశేషం. స్పీకర్ ఎన్నిక పూర్తి కావడంతో ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా షిండే తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. గత గురువారం రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ విశ్వాస పరీక్ష సోమవారం జరుగుతుంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బల పరీక్ష ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)