మనీ లాండరింగ్ కేసులో సంజయ్‌ రౌత్‌ అరెస్టు

Telugu Lo Computer
0


శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం అరెస్టు చేసినట్లు తెలిసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. సంజయ్‌ రౌత్‌తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై కోట్ల రూపాయల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. సంజయ్ రౌత్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో (మనీలాండరింగ్‌ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్‌ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)