భారతీయ విద్యార్థులకు రష్యా యూనివర్సిటీల ఆఫర్

Telugu Lo Computer
0


ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు ఇండియా తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు స్వదేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్ సంక్షోభంలో పడింది. తాజాగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీకి చెందిన డిప్యూటీ చీఫ్ రోమన్ బాబూష్కిన్ మాట్లాడుతూ రష్యన్ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అది కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండానే ప్రవేశం కల్పిస్తాయన్నారు. విద్యార్థుల చదువు ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే కోర్సు కంటిన్యూ చేయొచ్చని చెప్పారు. ఇది ఉక్రెయిన్ నుంచి చదువు మధ్యలో వదిలేసి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే స్కాలర్‌షిప్ ద్వారా చదువుకునే విద్యార్థులను కూడా రష్యన్ యూనివర్సిటీలు అనుమతించనున్నాయి. అయితే, ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యాలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)