ఇంట్లో సగం కాలిన శవాన్ని అలకరించుకుంటారు !

Telugu Lo Computer
0


ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే డాని తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ తెగ ఒకటి ఉందని 83 సంవత్సరాల క్రితం వరకూ ప్రపంచానికి తెలియదు. ఈ తెగ ప్రజలకు దూరంగా జీవిస్తుంది.. కనుక వీరి చిత్రాలను తీయడం చాలా కష్టం. అయితే కొంతమంది.. ఆ గిరిజన ఆచార వ్యవహారాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని కలిశారు. వారి చిత్రాలను, వింత ఆచారాలను ప్రపంచం ముందుకు తీసుకుని వచ్చారు. ఇంట్లో సగం కాలిన శవాన్ని అలకరించుకుంటారు. వందల ఏళ్ల క్రితం ఈ మనుషులు మనుషుల శవాలను తిని జీవించేవారని, కాలక్రమంలో జంతువులను చంపి వాటి మాంసాన్ని తినడం ప్రారంభించారని తెలుస్తోంది. ఈ తెగ మరో విచిత్రమైన ఆచారం ఏమిటంటే.. తమ బంధువులు, లేదా సొంత కుటుంబ సభ్యులు మరణిస్తే వారు ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టరు.. లేదా పూర్తిగా కాల్చరు. సగం కాల్చి ఆ మృతదేహాలను ఇంటికి తీసుకుని వస్తారు. మీడియా కథనాల ప్రకారం మృతదేహాలను సగం వరకు కాల్చిన తర్వాత, ఈ వ్యక్తులు దానిపై పంది కొవ్వును రాసి ఆ శవాలను మమ్మీలుగా చేసి ప్రత్యేక గుడిసెలో ఉంచుతారు. ఈ గుడిసెలోకి అందరినీ వెళ్లనివ్వరు. ఎంపిక చేసిన కొందరిని మాత్రమే గుడిసె లోపలికి అనుమతిస్తారు. వారు కూడా మమ్మీని తాకరు. ఈ తెగ అత్యంత ప్రమాదకరమైన ఆచారం ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు.. ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న స్త్రీ వేలుని కత్తిరిస్తారు. చేతివేళ్లు బలి ఇవ్వడాన్ని ఇకిపలిన్ అంటారు. ఇలా ఒక్కసారి కాదు.. ప్రతి సారీ జరుగుతుంది.. అంటే ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడల్లా స్త్రీ ఒకొక్క వేలు కత్తిరించబడుతుందన్నమాట. ఈ ఆచారాన్ని అక్కడి ప్రభుత్వం నిషేదించింది. అనాగరికమైన ఆచారాల నుంచి బయటకు రావాలని డానీ తెగ ప్రజలను ప్రభుత్వం కోరుతున్నది. వారిలో నాగరికతను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ, పట్టించుకోవడం లేదు. ఈ డానీ తెగలో దాదాపు 2.50 లక్షలమంది నివసిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందిని ప్రభుత్వం వారిలో మార్పులు తీసుకొచ్చింది. వారిని సమూలంగా మార్చి ఈ ఆచారాన్ని రూపుమాపే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)