రాబోయే ఆరేళ్లలో స్వదేశీ తొలి హైపర్‌సోనిక్ మిస్సైల్‌

Telugu Lo Computer
0


స్వదేశీ హైపర్‌సోనిక్ మిస్సైల్ తయారీలో నిమగ్నమైనట్లు ఇండియా, రష్యా డిఫెన్స్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ వెల్లడించింది. రానున్న 5, 6 ఏళ్లల్లో హైపర్‌సోనిక్ మిస్సైల్ ను ఇండియా తయారు చేస్తోందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో అతుల్ రాణే చెప్పారు. హైపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసే సామర్థ్యం బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కి ఉందని, రాబోయే ఆరేళ్లలో తొలి హైపర్‌సోనిక్ మిస్సైల్‌ను స్వదేశీయంగా డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హైపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా అయిదు రేట్ల అధికంగా వెళ్లడం, లేదా మాక్ 5 స్టేజ్‌ను చేరుకోవడం హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రత్యేకత.

Post a Comment

0Comments

Post a Comment (0)