నేను తలచుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 June 2022

నేను తలచుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా!


కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి 57వ బర్త్ డే వేడుకలు బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో జరిగాయి. ఈ వేడుకల్లో జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో నేను అనుకుంటే ఒక్కరోజైనా సీఎంను కాగలను అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు చేసినట్లు సీబీఐ అధికారులే చెప్పారని జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. రెడ్డి బ్రదర్స్ కు, శ్రీరాములకు డబ్బుపై ఆశలేదు. నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదని అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేత. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరు. బళ్లారి జిల్లా బిజెపి అద్యక్షుడుగా పనిచేశాడు. 2006 లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్యాటకం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

No comments:

Post a Comment