అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపిన టీచర్‌ సస్పెండ్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 June 2022

అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపిన టీచర్‌ సస్పెండ్‌


కర్ణాటకలోని మధుగిరి తాలూకా దొడ్డహట్టి గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.సురేశ్‌  విద్యార్థుల తల్లులతో ఇతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుడు సురేశ్‌ దొడ్డహట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏదైనా అవసరం మీద పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారి మొబైల్‌ నంబర్లను తీసుకుని అసభ్య ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి వికృతానందనం పొందేవాడు. తరచూ కాల్‌ చేసి విసిగించడం సరేసరి. ఇక ఊరిలోని పేద యువకులకు రాజకీయంగా సాయం చేస్తానని చేరదీసి సాయంత్రం వేళ వారితో కలసి మద్యం పార్టీలు చేసుకునేవాడు. పాఠశాల నిధులను దుర్వినియోగం చేయడం, గైర్హాజరు కావడం, ఆలస్యంగా రావడం, ముందే వెళ్లిపోవడంతో పాఠశాలకు పెద్ద సమస్యగా మారాడు. దీంతో మధుగిరి డీడీపీఐకి నెల క్రితం ఫిర్యాదు చేశారు. ఆరోపణలు అన్నీ నిజమని తేలడంతో సురేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

No comments:

Post a Comment