టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఐడియా ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 June 2022

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఐడియా !


విశాఖపట్నం లోని గురుద్వారా జంక్షన్ వద్ద ఓ హోటల్‌ వ్యాపారి నారాయణరావు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బిల్డింగ్ లో ఒక గెస్ట్ హౌస్, హోటల్ వుంది.  దీని పేరు నమో ఇన్స్పైర్ ద స్మార్ట్ ఇన్ గెస్ట్ హౌస్ . బిల్డింగ్ మొత్తం సోలార్ ప్యానెల్స్ తో ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకత. ఈ హోటల్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దూరం నుంచి చూస్తుంటే ఈ హోటల్‌ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ఎలివేషన్‌ల కోసం బ్లాక్‌ ఫ్రేమ్‌ అద్దాలకు బదులు సోలార్‌ ప్యానెళ్లను బిగించడం వల్ల మొదట్లో కాస్త ఖర్చు ఎక్కువైనా తర్వాత లైఫ్‌ టైమ్‌ అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. ఈ సోలార్‌ హోటల్‌ని వందశాతం గ్రీన్ బిల్డింగ్‌గా తీర్చిదిద్దాలని నారాయణరావు ఆలోచించి దాన్ని పూర్తిగా సోలార్ ప్యానెల్స్ తో కప్పారు. రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్తును ఈ సోలార్‌ ప్యానల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఐదంతస్తుల భవనం కింది అంతస్తు నుంచి పై వరకు చుట్టూ ఉన్న ఈ సోలార్ ఫ్యానల్స్‌ వల్ల రోజుకు 100 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ హోటల్‌ నిర్వహణకు రోజుకు 40 నుంచి 50 కిలో వాట్ల విద్యుత్ మాత్రమే అవసరం అవుతుంది. దీంతో మిగిలిన విద్యుత్‌ను ఆయన గ్రిడ్‌కు అమ్ముతున్నారు. ఈ బిల్డింగ్‌కు నారాయణరావు మూడు వైపులా సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటుచేశారు. త్వరలో రూఫ్ టాప్ పైన సోలార్ ప్యానల్ ఫిక్స్ చేస్తానంటున్నారు. మొత్తంగా 250 ప్యానెల్స్‌ని ఫిక్స్ చేశారు. ఈ సోలార్‌ ప్యానెల్స్‌ కోసం 15 లక్షల వరకు ఖర్చు అయిందన్నారు. అయితే ఈ మొత్తం పెట్టుబడి తనకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో వచ్చేస్తుందని.. ఆ తర్వాత లైఫ్‌ టైమ్‌ ఫ్రీ కరెంట్‌తో పాటు ఆదాయం కూడా వస్తుందంటున్నారు. 

No comments:

Post a Comment