అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరి పరిస్థితి సీరియస్ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనలో బాధితులకు చికిత్స అందుతోంది. అయితే ఇద్దరి పరిస్థితి సీరియస్ గా వుందని తెలుస్తోంది. అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనలో 8మందికి తీవ్ర అస్వస్థత వుంది. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ వైద్యసేవలు కోసం తరలించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 120మందికి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.బ్రాండిక్స్ లో జరిగిందా లేక పక్కనే ఉన్న మరో కంపెనీ నుంచి లీక్ అయిందా అనేది నివేదికలో రానుంది. డిజిటల్ మీటర్ల ద్వారా గ్యాస్ లీక్ తీవ్రతను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు గ్యాస్ లీక్ బాధితులతో నిండిపోయింది అనకాపల్లి ఆసుపత్రి. ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో బాధితులు రావడంతో బెడ్స్ కోసం ఇబ్బంది తప్పడం లేదు. బెడ్స్ కెపాసిటీ 120 కాగా గ్యాస్ లీక్ బాధితుల సంఖ్యే 130వుంది. ఆసుపత్రి రద్దీ పెరగడంతో ఉషా ప్రైం, సత్యదేవ, అగనంపూడి పీహెచ్ సీలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మరోవైపు NTR ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. యాజమాన్యం వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగిందని తెలితే కఠినంగా వ్యవహారిస్తాం అన్నారు మంత్రులు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు తెలిపారు. విశాఖ కేజీహెచ్ కు చేరుకుంటున్నారు గ్యాస్ లీక్ ఘటన లో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు. అత్యవసర విభాగం లో చికిత్స పొందుతున్న సత్యవతి, దమయంతి. బాధితుల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఎన్ టి ఆర్ ఆసుపత్రిలో గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. 48గంటల పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీఅయ్యాయి. గ్యాస్ లీక్ తర్వాత ఇళ్లకు వెళ్లిపోయిన కొంత మందికి స్వల్ప సమస్యలు వేధిస్తున్నాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)