ఫాదర్స్ డే ఎలా మొదలైంది ?

Telugu Lo Computer
0


ప్రతీ ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకుంటారు. ముఖ్యంగా ఇండియా, అమెరికా తదితర దేశాల్లో ఈరోజున ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో మార్చి, మే నెలల్లో జరుపుకుంటారు. కుటుంబం కోసం తండ్రి పడే తపన, కష్టం, నిస్వార్థ త్యాగం  వీటన్నింటిని గుర్తుచేసుకోవడంతో పాటు ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలంతా కలిసి కనీసం ఒక్కరోజైనా తండ్రితో గడిపేందుకే ఈ ఫాదర్స్ డే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసింది అమెరికాకు చెందిన సొనారా అనే మహిళ. సొనారా తల్లి చిన్నతనంలోనే చనిపోగా ఆరుగురు పిల్లలను తండ్రే పెంచి పెద్ద చేశాడు. భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల ఆలనా, పాలనా అన్నీ తానై చూసుకున్నాడు. బిడ్డలకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. సొనారా పెద్దయ్యాక తండ్రి త్యాగానికి గుర్తుగా ఏదైనా చేయాలనుకుంది. తన లాంటి తండ్రులందరికీ గౌరవార్థంగా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలని ఆమె పోరాటం చేసింది. ఆ తర్వాతి రోజుల్లో అమెరికా ప్రభుత్వం జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా గుర్తించింది. ఆరోజు తండ్రులందరికీ సెలవు దినం. అయితే ఇండియాలో దీన్ని అధికారికంగా గుర్తించలేదు కాబట్టి ఇక్కడ సెలవు ప్రకటించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)