భారత వైమానిక దళానికి మరో రికార్డు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 9 June 2022

భారత వైమానిక దళానికి మరో రికార్డు


ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో మన దేశం మూడో స్థానంలో వుంది.  వైమానిక దళాల వారీగా చూస్తే ఆరో స్థానంలో నిలిచింది. చైనా కన్నా మన ఎయిర్‌ 'ఫోర్స్‌' పైన ఉండటం గమనార్హం. 'వరల్డ్‌ డైరెక్టరీ ఆఫ్‌ మోడర్న్‌ మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (డబ్ల్యూడీఎంఎంఏ)' సంస్థ  అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది.  ప్రతి దేశానికి నేరుగా ఎయిర్‌ఫోర్స్‌తోపాటు పదాతిదళం (ఆర్మీ), నావికా (నేవీ) దళాలకు కూడా అనుబంధంగా ప్రత్యేకంగా వైమానిక దళ విభాగాలు ఉంటాయి. 'డబ్ల్యూడీఎంఎంఏ' ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసింది. కేవలం యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్ల సంఖ్యను మాత్రమేగాకుండా, విమానాలు, సాంకేతికతల ఆధునీకరణ, రవాణా సౌకర్యం, తక్షణ యుద్ధ సన్నద్ధత, వేగంగా దాడులు చేయడంతోపాటు స్వీయ రక్షణ చర్యలు, భవిష్యత్తులో రానున్న కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు, స్థానికంగా వైమానిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలన్నింటినీ పరిశీలించింది. వీటి ఆధారంగా 98 దేశాలకు చెందిన 124 వైమానిక/అనుబంధ దళాలకు.. 'ట్రూవ్యాల్యూ రేటింగ్‌ (టీవీఆర్‌)'లను ఇచ్చింది. అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ (టీవీఆర్‌ 242.9), యూఎస్‌ నేవీ (142.4) నిలవగా.. రష్యన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (114.2) మూడో స్థానం సాధించింది. తిరిగి నాలుగు, ఐదో స్థానాల్లో యూఎస్‌ ఆర్మీ ఏవియేషన్‌ (112.6), యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్‌ (85.3) నిలిచాయి. ఆరో స్థానంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (69.4) నిలిచింది. ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్‌ఫోర్స్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మన కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ (63.8) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే చైనా పీఎల్‌ఏ నేవీ ఎయిర్‌ఫోర్స్‌ (49.3) 15వ స్థానంలో నిలిచింది. మన ఇండియన్‌ నేవీ ఏవియేషన్‌ (41.2 స్కోర్‌) 28వ స్థానంలో, ఆర్మీ ఏవియేషన్‌ (30 స్కోర్‌) 36వ స్థానంలో ఉండిపోయాయి.


No comments:

Post a Comment