అభ్యాస్‌ పరీక్ష విజయవంతం

Telugu Lo Computer
0


ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్ రేంజ్ నుంచి హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్  అభ్యాస్‌ ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) బుధవారంనాడు విజయవంతంగా పరీక్షించింది. గ్రౌండ్ బేస్డ్ కంట్రోలర్ నుండి సబ్‌సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్‌ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టార్గెట్ విమానం పని తీరును టెలిమెట్రీ, రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం వంటి వివిధ సెన్సర్ల ద్వారా పర్యవేక్షించినట్లు దీన్ని రూపొందించిన డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని డిఆర్‌డిఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో దీన్ని అభివృద్ధి చేశారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు డీఆర్‌డీఓ శాస్త్రజ్ఞులు, సాయుధ బలగాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)