అఘాడి కూటమిలో క్యాంపు రాజకీయాల కలకలం

Telugu Lo Computer
0


మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగినట్లు అయింది. మహా వికాస్ అఘాడి కూటమిలో క్యాంపు రాజకీయాల కలకలం రేపింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యనేతలతో శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్దేవ్ థాక్రే సమావేశమయ్యారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. సూరత్ క్యాంపులో నలుగురు మంత్రులు సహా మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. క్యాంపులోని ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు శివసేన తీవ్ర ప్రయత్నాలు జరుపుతుంది. ఎమ్మెల్యే క్యాంపు రాజకీయాలతో అసెంబ్లీలో బలాబలాలు మారుతున్నట్లు చెబుతున్నారు. మహరాష్ట్రలో సోమవారం 10 స్థానాలకు శాసన మండలి ఎన్నికలు జరిగాయి. కూటమి భాగస్వామ్య పార్టీలైన శివసేన రెండు, ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ పార్టీ నాలుగు మాత్రమే గెలుచుకునే సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఐదు స్థానాల్లో విజయం సాధించి ఆశ్చర్యం కలిగించింది. అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)