బీహార్‌ ఎంఐఎం పార్టీలో చీలిక ?

Telugu Lo Computer
0


ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లో పోటీ చేసి పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్రతిపక్షానికి పరిమితమయ్యేలా చేసింది. ఇప్పుడు ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. తర్వాలోనే ఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీలో విలీనం కానున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ వార్తలను ఎంఐఎం నాయకుడు అక్తరుల్‌ ఇమామ్‌ కొట్టిపారేశారు. 2020 ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని పెద్ద పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితిలో తలొగ్గరని చెప్పారు. కాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో ఇప్పటికే సంప్రథింపులు పూర్తయ్యాయని, తర్వలోనే నలుగురు ఎమ్మెల్యేలు లాంతరు పట్టుకోకున్నారని ప్రచారం జరుగుతున్నది. 2021 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్‌ గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీచేసినప్పటికీ.. ఒక్క చోటా గెలుపొందకపోవడం, ముస్లిం కూడా ఆ పార్టీకి ఓట్లు వేయలేదని, దీంతో వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నారని పేర్కొనారు. ఈ నలుగురి చేరికతో బీహార్‌ అసెంబ్లీలో ఆర్జేడీ బలం 76కు చేరనుంది. ప్రస్తుతం అధికార బీజేపీ కూటమికి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, 2020లో జరిగిన ఎన్నికల్లో 20 స్థానాల్లో ఆర్జేడీ విజయావకాశాలను ఎంఐఎం ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)