ఉదయ్ పూర్ ఘటన బాధితులకు అశోక్ గెహ్లాట్ పరామర్శ

Telugu Lo Computer
0


ఉదయపూర్ లో ఇద్దరు వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్ కుటుంబ సభ్యులను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరామర్శించారు. స్వయంగా కన్హయ్య లాల్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కన్హయ్య కుటుంబ సభ్యులకు రూ.51 లక్షల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు సహకరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కేసు గురించి తాను హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ కేసు విచారణను ఒక నెలలోపు పూర్తి చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను కోరుతానని చెప్పారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రాన్నే కాకుండా యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. రాజస్థాన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి నెలకొనేలా మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)