బస్సు లోయలో పడిన 25 మంది మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 6 June 2022

బస్సు లోయలో పడిన 25 మంది మృతి


ఉత్తరాఖండ్ లోని  ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతంలోయమునోత్రి రహదారిపై 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యాత్రికులంతా మధ్యప్రదేశ్​లోని పన్నా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వారంతా యమునోత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 25 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయినట్లు చెప్పారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్​లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించామన్నారు.

No comments:

Post a Comment