సముద్రజీవులపై మ్యూజియం

Telugu Lo Computer
0


తమిళనాడులోని  పెరంబలూరులో సముద్రజీవుల మ్యూజియాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ వెంకటప్రియ తెలిపారు. పెరంబలూరు తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలోని సెంటినరీ భవనంలో ఏర్పాటుచేసిన 12 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిన సముద్రపు జీవి 'అమోనైట్స్‌' కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నత్త ఆకారం కలిగిన అమోనైట్స్‌ 12 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిందని, ఈ జీవుల నమూనాలు పెరంబలూరు జిల్లాలో ఎక్కువగా లభిస్తున్నాయని తెలిపారు. వాటిని ప్రజలు తిలకించేలా తాలూకా కార్యాలయం లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈ జిల్లాలో 300 రకాల జలజీవుల అవశేషాలు లభించాయని, వాటితో మ్యూజియం ఏర్పాటుచేశామని, త్వరలో ప్రజల సందర్శన కోసం దీనిని ప్రారంబిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)