పెదాలపై ముద్దులు పెట్టడం లైంగిక నేరమేమీ కాదు!

Telugu Lo Computer
0


ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన బీరువాలో దాచుకున్న డబ్బులను తరచుగా మాయం అవుతుండడంతో తన 14 ఏళ్ల కుమారుడిని డబ్బులు ఏమవుతున్నాయని గద్దించాడు. దాంతో బాలుడు అసలు నిజం చెప్పాడు." ఆ డబ్బులు నేనే తీస్తున్నాను. వాటితో ఆన్‌లైన్ గేమ్స్ రీచార్జ్ చేయించుకుంటున్నాను. కానీ, నేను రీచార్జ్ కోసం షాపునకు వెళ్లిన ప్రతిసారి యజమాని నన్ను దగ్గరుకు తీసుకుని, ముద్దులు పెడుతున్నాడు, ప్రైవేటు పార్టులను తడుముతున్నాడు" అని చెప్పాడు. అనంతరం బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 377 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయించాడు. ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు ఇటీవల బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కేసును విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభు దేశాయ్ ధర్మాసనం నిందితుడు బాలుడి పెదాలపై ముద్దులు పెట్టాడని, తాకాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని, అయితే సెక్షన్ 377లో పేర్కొన్న అసహజ లైంగిక నేరాల కిందికి ఇవి రావని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిలు మంజూరు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)