సెంట్రల్ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


సెంట్రల్ ఢిల్లీలోని ఝాండేవాలన్ సైకిల్ మార్కెట్‌ గోదాములో శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాములో మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో 27 అగ్నిమాపటక శకటాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని చెప్పారు. ప్రమాద కారణాలు కానీ, ఏమేరకు ఆస్తినష్టం జరిగిందనేది కానీ వెంటనే తెలియలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)