భారత్ ను ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్

Telugu Lo Computer
0


భారత ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించడంపై ఆయన స్పందించారు. భారత్ క్వాడ్ లో సభ్యదేశం అయినా అమెరికా నుంచి ఒత్తడి ఉన్నా కూడా రష్య నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసుకుందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంలో పని చేస్తుందని అన్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ తలాతోక లేని కోడిలా తయారైందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. గతంలో మా ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రజల అవసరాలే ప్రధానం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వంలోని మీర్ జాఫర్లు, మీర్ సాదిక్ లు బలవంతంగా బాహ్య దేశాల ఒత్తడికి తలొగ్గుతున్నారని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)