బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించిన యువకుడు

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని 16 ఏండ్ల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆ బాలికను యువకుడు పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లతో తంతూ పరుగెత్తించాడు. బాధితురాలు కింద పడిపోయినా కనికరం చూపకుండా.. ఆమెపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనను యువకుడి స్నేహితులు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఘటన 15 రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. యువకుడు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సీరియస్‌గా స్పందించారు. బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)