బీజేపీ నేత తజిందర్ అరెస్టు

Telugu Lo Computer
0


బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను  పంజాబ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మొహాలీలోని సైబర్ సెల్‌లో నమోదు అయిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని ఢిల్లీలో పట్టుకున్నారు. బీజేవైఎం జాతీయ కార్యదర్శి అయిన తజిందర్‌పై ఆప్ నేత సన్నీ సింగ్ ఫిర్యాదు చేశారు. తజిందర్ విద్వేష ప్రకటనలు చేస్తున్నాడని, అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని, మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్చి 30వ తేదీన జరిగిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను తజిందర్ బెదిరించినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు సంబంధించిన వీడియోలను పోలీసులకు సమర్పించారు. తజిందర్ అరెస్టును బీజేపీ ఖండించింది. పంజాబ్‌లో రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ పేర్కొన్నది. 50 మంది పంజాబీ పోలీసులు వచ్చి తజిందర్‌ను ఇంటి నుంచి తీసుకువెళ్లినట్లు బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. తజిందర్‌ను పంజాబ్‌కు తీసుకువెళ్తుండగా హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. బగ్గా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. గతంలో అయిదు సార్లు నోటీసు ఇచ్చినా బగ్గా విచారణకు హాజరుకాలేదని పంజాబ్ పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)