అవయవ దానం చేసిన ఆరేళ్ల చిన్నారి

Telugu Lo Computer
0


ఇటీవల రోలి ప్రజాపతి అనే ఆరేళ్ల చిన్నారి గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను తల్లిదండ్రులు న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. కాల్పుల్లో చిన్నారి తలకు గాయం కారణంగా కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు చిన్నారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా  ఉపయోగం లేకుండాపోయింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వైద్యం అందించినా ఉపయోగం లేదని వైద్యులు నిర్ధారించి ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. అవయవదానం గురించి తెలిపి, వారి కౌన్సెలింగ్ చేశారు. అవయవ దానంకు రోలి ప్రజాపతి తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వైద్యులు ఆ మేరకు చర్యలు చేపట్టి ఐదుగురు ప్రాణాలను కాపాడారు. చిన్నారి కాలేయం, మూత్రపిండాలు, కార్నియా, గుండె కవాటం రెండింటిని తీసుకొని ఇతరులకు అమర్చారు. ఈ అవయవ దానంతో ఢిల్లీలోని ఎయిమ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కులైన దాతగా రోలి నిలిచారు. ఈ విషయంపై సీనియర్ ఎయిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ.. రోలీ అనే ఆరున్నరేళ్ల బాలిక ఏప్రిల్ 27న ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు తుపాకీ గాయమైంది. ఆమె మెదడులో బుల్లెట్ ఉంది. మెదడు పూర్తిగా దెబ్బతింది. దాదాపు బ్రెయిన్ డెడ్‌లో ఉన్న ఆమె ఆసుపత్రికి చేరుకుంది. మేం చిన్నారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. బ్రెయిన్ డెడ్ కావడంతో చిన్నారి తల్లిదండ్రులకు విషయాన్ని వివరించి అవయవ దానంపై అవగాహన కల్పించాం. వారు ఒప్పుకోవడంతో ఆరున్నరేళ్ల చిన్నారి ఐదుగురికి ప్రాణదానం చేసినట్లయిందని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)