అమిత్ గుజరాతీ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Telugu Lo Computer
0


క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ లకు అమిత్ గుజరాతీ అండగా ఉన్నాడు. హైదరాబాద్ పోలీసులు అమిత్ గుజరాతిని వల పన్ని పట్టుకున్నారు. పీటీ వారెంట్ మీద హైదరాబాద్ కు తీసుకొని రానున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ కి అమిత్ గుజరాతి పెద్ద నెట్ వర్క్ కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతుంటాడు. గత కొన్నేళ్ళుగా బెట్టింగులు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొట్టింది అమిత్ గ్యాంగ్. పక్కా ఇన్ఫర్మేషన్ తో బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు అమిత్ గుజరాతీని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. అమిత్ గుజరాతీని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే బెట్టింగ్ కు సంబంధించి డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)