పుతిన్‌పై కెనడా నిషేధం !

Telugu Lo Computer
0


ఇప్పటికే రష్యాపై ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా, తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ పై నిషేధం విధించింది. పుతిన్‌ తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును సెనెట్ లో ప్రవేశపెట్టింది. యుద్ధం వల్ల ఎదురువుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్‌ గడ్డపై పాల్పడుతున్న యుద్ధనేరాలకు బదులు తీర్చుకునేందుకు పుతిన్‌, ఆయన అనుచర గణం ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నిషేధం బిల్లు ఆమోదం పొందితే పుతిన్ తో పాటు.. ఆ దేశ ప్రభుత్వంలోని అధికారులు, మిలటరీ పెద్దలు సహా సుమారు వెయ్యి మందికి పైగా కెనడాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు.

Post a Comment

0Comments

Post a Comment (0)