ఒంగోలు రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నుంచి ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఆదివారం 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిఆర్‌పి సిఐ రామారావు, ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ హేరా లాల్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని మూర్తి పెరియ పొన్నయ్యగా గుర్తించారు. అతడు తమిళనాడు లోని తేని జిల్లా తేవరం గ్రామానికి చెందినవాడు. చెన్నైకి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడు. శనివారం పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న పొన్నయ్యను టీటీఈ గుర్తించారు. ఫైన్ కట్టకపోవడంతో ఒంగోలు స్టేషన్‌లోనే టీటీఈ అతడిని రైలు నుంచి దించేశాడు. ఆ సమయంలో జీఆర్‌పీ సీఐ రామారావు, సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తున్నారు. పొన్నయ్య కదలికలపై వారికి అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని చెక్ చేయగా బ్యాగ్‌లో 10 కిలోల గంజాయి బయటపడింది. వారు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ కోసం రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)