ప్రపంచాన్ని కలవరపెడుతున్నమంకీపాక్స్

Telugu Lo Computer
0


మే7న మొదటి మంకీ పాక్స్ కేసు లండన్ లో నమోదైంది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ మంకీపాక్స్ సోకింది. ఆ తర్వాత అమెరికా, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యూఎస్, స్వీడన్, కెనడా దేశాల్లో కూడా ఇటీవల అరుదైన మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదవడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా దేశాల్లో శుక్రవారమే మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రావడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆఫ్రికా దేశానికి వెళ్లని వారిలోనూ కేసులు నమోదు కావడంపై అయోమయం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో కూడా వైరస్ ఇలా వ్యాపించలేదని ప్రముఖ వైరాలజిస్ట్ ఒయ్​వాల్ తొమోరి తెలిపారు. వైరస్​లో ఏదో మార్పులు సంభవించి ఉండొచ్చని అన్నారు. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. పరిస్థితిని నిరంతరం కన్నేసి ఉంచాలని ఐసీఎంఆర్​, సీడీసీలకు ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ కేసులు బయటపడ్డ దేశాల నుంచి వచ్చిన, ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రయాణికులు తమకు లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఐసోలేషన్​కు వెళ్లాలని సూచించింది. ఈ ప్రయాణికుల నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్​కు పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ సహా పలు ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాపి నేపథ్యంలోనే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తాజా ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారు. శృంగారం ద్వారా కూడా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందా అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నారు . మంకీపాక్స్ వ్యాధి సోకిన వారి నుండి ఇది ఇతరులకు సోకడం చాలా తేలిక. శ్వాస నాళాలు, గాయాలు, ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా ఇది ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. తాజాగా మంకీపాక్స్ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించిస్తున్నారు. మంకీపాక్స్ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే నిపుణులు హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రముఖ వైరాలజిస్ట్ ఒయ్​వాల్ తొమోరి మాట్లాడుతూ "ఎబోలా వంటి వైరస్​ లు ప్రారంభంలో శృంగారం ద్వారా సోకేవి కాదు. కానీ, వాటి వ్యాప్తి తీవ్రమైన తర్వాత సెక్స్ కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది. మంకీపాక్స్ విషయంలో కూడా ఇది నిజం కావొచ్చు. దీనిపై రికార్డులను పరిశీలించాల్సి ఉంది. భార్యాభర్తలకు, పరస్పర లైంగిక సంబంధం ఉన్న వ్యక్తులకు వైరస్ సోకిందేమో అన్న విషయాన్ని తెలుసుకోవాలి" అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)