జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం

Telugu Lo Computer
0


పంజాబ్ ప్రభుత్వం జైళ్లలో వీఐపీ రూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీఐపీ రూములను జైలు మేనేజ్‌మెంట్ బ్లాకులుగా మార్చనున్నట్లు వెల్లడించింది. జైలు సిబ్బంది సులువుగా పనిచేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం భగవంత్ మన్ సింగ్ తెలిపారు. జైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని భగవంత్ మన్ హెచ్చరించారు. జైళ్లలో కొందరు ఖైదీలు ఫోన్లు వినియోగిస్తుండటంపై కూడా సీఎం స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, ఇప్పటివరకు ఖైదీల దగ్గర నుంచి 710 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఫోన్లు కలిగి ఉన్న ఖైదీలపై చర్య తీసుకున్నట్లు చెప్పారు. ''దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. నిందితులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాం. బాధ్యులైన కొందరు అధికారులను సస్పెండ్ చేశాం'' అని సీఎం తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)