ఆకాశ ఎయిర్ విమానాలు సిద్ధం !

Telugu Lo Computer
0


ఆకాశ ఎయిర్ కి సంబంధించి మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం అయ్యాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 'బోయింగ్ 737 మ్యాక్స్' ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 'బోయింగ్ 737 మ్యాక్స్' విమానాలను ఆకాశ ఎయిర్ ఆర్డర్ చేసింది. ఈమేరకు మొదటి విడతగా సిద్ధమైన నాలుగు విమానాలు జూన్ మధ్య నాటికి సంస్థకు బోయింగ్ సంస్థ అప్పగించనుంది. అనంతరం జులై నుంచి దేశీయంగా విమాన సేవలు ప్రారంభం అవుతాయని ఆకాశ సంస్థ తెలిపింది. అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమానాల ఫోటోలను సంస్థ సోమవారం మీడియాకు విడుదల చేసింది. ఆరంజ్, ఊదా రంగులలో చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన విమానాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయంటూ సంస్థ తెలిపింది. మొదటి విడతగా తయారు చేసిన 18 విమానాలు మార్చి 23 నాటికి ఆకాశ సంస్థకు అప్పగించనున్నది బోయింగ్ సంస్థ. జెట్ ఎయిర్ వేస్ తో కలిసి 2022 మధ్య నాటికి పూర్తి స్థాయిలో విమాన సేవలు భావించాలని చూస్తుంది. వచ్చే ఏడాది మార్చి 23 నాటికి తమ 18 విమానాలతో దేశీయంగా టయర్ 2, టయర్ 3 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. అయితే జెట్ ఎయిర్ వేస్ ఇటీవలే జెట్ ఎయిర్‌వేస్ భారత హోం మంత్రిత్వ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్‌ను పొందగా..DGCA నుండి AOC లైసెన్స్ పొందింది. అయితే ఆకాశ ఎయిర్ మాత్రం ఇంకా ఈ క్లియరెన్స్ లకు అప్లై చేయాల్సి ఉంది. దేశీయ విమాన ప్రయాణాలకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో రానున్న 20 ఏళ్లలో భారత్ లో 1000 కొత్త విమానాలు అవసరం ఉంటుందని ఎయిర్ వేస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)