'షవర్మా' తిని బాలిక మృతి

Telugu Lo Computer
0

 

కేరళలోని ఓ షాప్‌లో షవర్మా తిన్న 16 ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందింది. దాంతోపాటు 18మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. షాప్ మీద కేస్ బుక్ చేసి, సీల్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేనట్లు అధికారులు తెలిపారు. “మరిన్ని కేసులు నమోదు కావొచ్చని భావిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్ సీ, చెరువతూరు పీహెచ్ సీ, నీలేశ్వరమ్ తాలూక్ హాస్పిటల్స్ ఘటనా స్థలానికి వచ్చి తగు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో ఉండి లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వెంటనే చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నట్లు” జిల్లా ఆరోగ్య అధికారి ఏవీ రామ్దాస్ తెలిపారు. ఆరోగ్యం మరింత విషమంగా ఉంటే జిల్లా హాస్పిటల్ కు తరలిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు గానూ మంత్రి ఎమ్వీ గోవర్దన్ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ లో క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయాలని చెప్తూనే ఉన్నామని వెల్లడించారు. “రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీపై పరీక్షలు జరపనున్నాం” అని మంత్రి తెలిపారు. షవర్మా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిన షాప్ ఓ ట్యూషన్ సెంటర్ కు దగ్గరగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)